Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మధుమేహం ఉందో, లేదో? మీ నోటిని అడిగితే చెబుతుంది!

Signs of diabetes in your mouth and breath
  • 250/300 బ్లడ్ గ్లూకోజ్ తో పెరిగిపోయే కీటోన్లు
  • దీని కారణంగా నోటి నుంచి దుర్వాసన
  • చిగుళ్లలో ఇన్ఫెక్షన్.. పళ్లలో పుచ్చులు
  • మూత్ర పరీక్షతోనూ తెలుసుకోవచ్చు
జీవనశైలి మార్పుతో మధుమేహం ముప్పు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. దీని ప్రభావం శరీరంలో ఎన్నో అవయవాలపై పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమయ్యే ఆరోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి.

కరోనా వైరస్ ప్రభావం మధుమేహ బాధితుల్లో ఎక్కువగానే ఉంటోందని గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. కనుక మధుమేహం ఉందా? లేదా.. ఉంటే నియంత్రణలో ఉందా? అన్నది ముఖ్యంగా చూసుకోవాలి. అప్పుడే వైద్యులను సంప్రదించడం, వారి సూచనల మేరకు సంరక్షణ చర్యలకు అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే న్యూరోపతి, కిడ్నీల్లో రాళ్లు, హార్ట్ ఎటాక్, అంధత్వం వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే, నోటి చుట్టూ కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయని మయో క్లినిక్ సైతం చెబుతోంది. ‘‘మధుమేహం శరీరంలోని అన్ని అవయవాలతో ముడిపడి ఉంటుంది. నోరు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మధుమేహం అంటే కిడ్నీలు, నెర్వ్ లు గురించి మాట్లాడుతుంటారు. నోటి గురించి ఎవరూ ప్రస్తావించరు. కానీ, మధుమేహం వచ్చిన వారిలో తరచూ నోటి ఇన్ఫెక్షన్లు సాధారణంగా మారతాయి. పళ్లు, చిగుళ్లు, నోటి ఇన్ఫెక్షన్ లను గుర్తించొచ్చు’’ అని గురుగ్రామ్ కు చెందిన ఆర్టెమిస్ హాస్పిటల్ చీఫ్ ఎండోక్రైనాలజిస్ట్ ధీరజ్ కుమార్ తెలిపారు.

‘‘నోటి నుంచి దుర్వాసన వస్తుందేమో చూసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా ఉంటుంటే పళ్లల్లో పుచ్చులు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక మధుమేహం కారణంగా కీటోన్ స్థాయులు పెరిగిపోతే అప్పుడు డయాబెటిక్ కెటోఅసిడోసిస్ కు దారితీస్తుంది. దీనివల్ల నోటి దుర్వాసన వస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ 250/300 ఉండే వారిలో ఈ పరిస్థితి చూడొచ్చు. అందుకే యూరిన్ లో కీటోన్లు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి’’ అని ధీరజ్ కుమార్ తెలిపారు.
diabetes
foul breath
signs of diabetes

More Telugu News